కాంగ్రెస్​ ఒక్క సీటూ గెలవలే..  67 చోట్ల డిపాజిట్లు గల్లంతు

ఢిల్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి    

సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో నేలకరిచింది. సీనియర్​ లీడర్​షీలాదీక్షిత్​ హయాంలో పదిహేనేళ్ల పాటు ఢిల్లీని పాలించిన పార్టీ.. ఈ ఎన్నికల్లో కనీస ప్రభావం కూడా చూపలేకపోయింది. 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో గెలుపు మాట అటుంచి 67 చోట్ల పార్టీ కేండిడేట్లకు డిపాజిట్​ కూడా దక్కలే..  గాంధీనగర్, బద్లీ, కస్తూర్బా నగర్​లలో మాత్రమే కాంగ్రెస్  కేండిడేట్లు డిపాజిట్​దక్కించుకున్నరు. టోటల్​గా కాంగ్రెస్​ పార్టీని ఢిల్లీ ఓటర్లు దూరంపెట్టారు. ఎన్నికల్లో తమకు ఘోర ఓటమి ఎదురైనప్పటికీ బీజేపీ కూడా ఓడిపోవడంతో కాంగ్రెస్​ నేతలు పలువురు హ్యాపీగా ఫీలవుతున్నరు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆప్​ విజయాన్ని సెలబ్రేట్​ చేసుకున్నరు. కేజ్రీవాల్​కు ఆయన అభినందనలు తెలిపారు. ఢిల్లీలో పార్టీని కిందిస్థాయి నుంచి సంస్కరించాల్సిన టైమొచ్చిందని పార్టీ సీనియర్​ లీడర్లు అభిప్రాయపడ్డారు. కొత్త నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నారు. పార్టీ ఓటమిపై బాధగా ఉన్నా.. బీజేపీ విషప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారంటూ వారు ఆనందం వ్యక్తంచేశారు.

డిపాజిట్ గల్లంతు​అంటే..

ఎన్నికల బరిలో ఉన్న కేండిడేట్​కు ఆ నియోజకవర్గంలో పోలైన మొత్తం వ్యాలీడ్​ ఓట్లలో కనీసం 6 శాతం ఓట్లు పడితే డిపాజిట్​ దక్కిందని అంటారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన డిపాజిట్​ చేసిన మొత్తాన్ని ఈసీ తిరిగిస్తుంది. 6 శాతం కన్నా తక్కువ ఓట్లు వచ్చిన కేండిడేట్​కు ఈసీ డిపాజిట్​ తిరిగివ్వదు.

నిర్ణయాల్లో ఆలస్యం, యూనిటీ లేకే..

ఎన్నికల్లో పోటీకి సంబంధించి పార్టీకి సరైన స్ట్రాటజీ లేకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో జరిగిన ఆలస్యం వల్లే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని ఆ పార్టీ నేషనల్ అధికార ప్రతినిధి శర్మిష్ఠ ముఖర్జీ అన్నారు. ఢిల్లీ నేతల్లో యూనిటీ లేకపోవడం కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిందని అన్నారు.

Latest Updates