యూపీలో ప్రియాంకకు 41,సింధియాకు 39 సీట్లు

రాబోయే ఎన్నికల కోసం పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది కాంగ్రెస్‌ పార్టీ.  ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. జ్యోతిరాధిత్య సింధియాకు పార్లమెంట్‌ సీట్ల బాధ్యతలు పంచారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో మొత్తం 80 స్థానాలుండగా… ప్రియాంకు 41 MP సీట్లు, సింధియాకు 39 సీట్లు అప్పగించారు. తర్వాత ప్రియాంక యూపీలోని పలువురు ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

లక్నోలో కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతం కావడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.  సాధారణ ఎన్నికల్లో యూపీలో అత్యధిక స్థానాలు దక్కించుకుని కేంద్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది.

Latest Updates