లోకల్ ఫైట్: కాంగ్రెస్ MPTC అభ్యర్థి కిడ్నాప్

ప్రచారానికెళ్లిన తన భర్తను టీఆర్‍ఎస్ నాయకులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారంటూ వరంగల్‍రూరల్‌ జిల్లాపర్వతగిరి మండలం కొంకపాకకు  చెందిన సూర్నభాగ్యలక్ష్మి ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి హన్మకొండ హరిత హోటల్ దగ్గర ఆమె ఆందోళనకు దిగారు. కొంకపాక ఎంపీటీసీ స్థానాని కితన భర్త సూర్న లింగయ్య  కాంగ్రెస్‌‌ అభ్యర్థి  పోటీ చేస్తున్నారని ఆమె విలేకరులతో చెప్పారు. తన భర్తగెలుపు దాదాపు ఖాయమని భావించిన టీఆర్‌‌ఎస్‌‌ నేతలు పార్టీ మారాలని అడిగారని, నిన్న ఎవరికి చెప్పకుండా తీసుకెళ్లి గులాబీ కండువా కప్పి ఎక్కడో దాచిపెట్టారని ఆరోపిం చారు. టీఆర్‌‌ఎస్‌‌ వాళ్లు తననువేధిస్తున్నారని, కాంగ్రెస్‌‌ నేతలను తీసుకుని హరితహోటల్‌ దగ్గరకు రావాలని తన భర్త ఫోన్‍ చేసి చెప్పారన్నారు. తాను భయపడి విషయాన్ని కాంగ్రెస్‌‌ మండలనేత దేవేందర్‌‌రావుకు చెప్పానని, ఆయన వర్థన్నపేటమాజీ ఎమ్మెల్యే  కొండేటి శ్రీధర్‍, వరంగల్​ డీసీసీప్రెసి డెంట్ నాయిని రాజేందర్ రెడ్డికి చెప్పారన్నారు. గ్రామస్థులతో పాటు వారంతా హరిత హోటల్‌ దగ్గరకు చేరుకున్నారు.

టీఆర్‍ఎస్‍ది అరాచకం….

కాంగ్రెస్‍ అభ్యర్థులు గెలిచే చోట టీఆర్‍ఎస్‌‌ అరాచకాలు చేస్తున్నదని , పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డివిమర్శించారు. కొంకపాక ఎంపీటీసీ కాం గ్రెస్‌‌ అభ్యర్థిలిం గయ్యను కిడ్నాప్ చేశారని ఆరోపిం చారు. వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తమ ఓపికను తప్పుగా అర్థం చేసుకోవద్ధన్నారు. తమ అభ్యర్థిని వెంటనే వెతికివారి కుటుంబ సభ్యులకు అప్పగిం చాలని పోలీసులను కోరారు. లింగయ్య భార్య భాగ్యలక్ష్మితో కలిసి వెళ్లిసీపీకి ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు.

భార్య ప్రచారం..

వరంగల్​ రూరల్​ జిల్లా పర్వతగిరి మండలంలోని కొంకపాక నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తన భర్త సుర్ణ లింగయ్యను కొందరు కిడ్నాప్ చేసి విత్‌‌డ్రా చేసుకోమని ఒత్తిడి తెస్తున్నారని అతని భార్య భాగ్యలక్ష్మి ఆరోపించారు. శనివారం కొం కపాకలో ఆమె ఇంటింటికి తిరుగు తూ తన భర్తను గెలిపించాలని కోరింది. తన భర్తను ఎక్కడో దాచిపెట్టారని, అయినా తాను అతని కోసం ప్రచారం చేస్తానంది. లింగయ్య కిడ్నాప్ గురించి పర్వతగిరి సీఐ శ్రీధర్ రావును వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.

Latest Updates