ఆవుని తాకితే మనలోని చెడు నశిస్తుంది

ముంబై: ఆవులను చూసినా.. తాకినా మనలోని చెడు నశిస్తుందని, నెగిటివిటీ పూర్తిగా దూరమవుతుందని కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మంత్రి యశోమతి ఠాకూర్ చెప్పారు. ఈ విషయాన్ని మన సంప్రదాయం భోదిస్తోందని, కానీ మనం మరచిపోతున్నామని అన్నారామె. ఆదివారం నాడు మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఆవులను తాకితే నెగిటివిటీ పోతుందన్న యశోమతి వ్యాఖ్యలను సోషల్ మీడియాలో కొందరు తప్పుబట్టారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ మూఢనమ్మకాలను ప్రచారం చేయడమేంటని, సెక్యులర్ దేశంలో ఇలాంటి వాటికి తావులేదని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. దీంతో ఆమె తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

మనది గోవులను తల్లిలా చూసుకునే సంప్రదాయమని, ఆవులను, ఎద్దులను రైతులంతా ఎంతో ప్రేమగా చూసుకుంటారని అన్నారు మంత్రి యశోమతి. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా ఎందుకు చూస్తున్నారో తనకు అర్థం కావడం లేదని చెప్పారామె. అందులో మూఢత్వం ఏముందని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తినేనని చెప్పుకొచ్చారు. అయితే తాను సర్వధర్మాలను (అన్ని మతాలు) నమ్ముతానని తెలిపారు మంత్రి యశోమతి. తాను హిందువునే అయినప్పటికీ దర్గాకు కూడా వెళ్తానని వివరించారు.

More News:

రాజకీయాలు, దేశ సంపద హిందూ ఆగ్రవర్ణాల చేతిలోనే: ఒవైసీ

6 లక్షల 25 వేల కిలోల డబ్బు ట్రాన్‌పోర్ట్ చేశాం.. 20కిలోలకు రూ.కోటి

పంటిలో ఇరుక్కున్న పాప్‌కార్న్.. ప్రాణం మీదికి తెచ్చింది

Latest Updates