ఒకే రోజు 6 రేప్ ఘటనలా? పోలీసులు ఏం చేస్తున్నారు?

  • మహిళలపై జరుగుతున్న ఘోరాలు సిగ్గుచేటు: చిదంబరం

యూపీలోని ఉన్నావ్, హైదరాబాద్ దిశ రేప్, హత్య ఘటనల గురించి తెలిసి తాను షాక్ అయ్యానని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. మహిళపై జరుగుతున్న ఈ ఘోరాలు మనకు సిగ్గుచేటన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిన్న బెయిల్‌పై విడుదలైన చిదంబరం గురవారం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన దిశ ఘటన సహా దేశంలో స్త్రీలపై జరుగుతున్న దారుణాలపై స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల తాను షేమ్ ఫీలవుతున్నానని అన్నారు.

MORE NEWS:

స్త్రీని భోగవస్తువులా చూడకూడదు.. మగవాడు కట్టుబాట్లు పాటించాలి

హైదరాబాద్‌లో రెండ్రోజులపాటు 144 సెక్షన్

కైలాస దేశం: రాజు, దేవుడు నిత్యానంద.. ప్రధాని ఓ కోలీవుడ్ నటి!

ఈ అకృత్యాలు జరగడం దారుణమని, ఇంతటి ఘోరమైన పనులు చేసి తప్పించుకోవచ్చనుకునే కొంత మంది మన సమాజంలో తిరుగుతుండడం సిగ్గుచేటని అన్నారు చిదంబరం. దేశ వ్యాప్తంగా శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోయిందన్నారు. ఇన్ని ఘోరాలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు చిదంబరం. చట్టం అంటే భయం లేకుండా పోయిందని, నిన్న ఒక్కరోజే న్యూస్ పేపర్‌లో ఆరు రేప్ ఘటనలు చూశానని అన్నారు. ఇంతటి దారుణమైన స్థితిలో బతుకుతున్నామని, ఇది సమాజానికి సిగ్గుచేటని చెప్పారు.

Latest Updates