2 లక్షల ఉద్యోగాలుంటే 20 వేలు భర్తీ చేస్తారా?: జీవన్ రెడ్డి

టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు మధ్యంతర భృతి  ఇస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదన్నారు. గాంధీ భవన్ లో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చాంచారు నేతలు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశానికి మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రీసెంట్ గా ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి 19 మంది ఎన్నికవ్వగా ఇప్పటికే 10 మంది టీఆర్ఎస్ లో చేరారు. దీంతో పార్టీ మారిన నేతలపై ప్రధానంగా చర్చించారు.

మరోవైపు రీసెంట్ గా MLC ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం, లోక్ సభ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు గెలవటానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు నేతలు. అనంతరం మాట్లాడిని జీవన్ రెడ్డి.. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగులు ఖాళీగా ఉంటే 20 వేల ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. పక్కనున్న ఏపీ 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చిందన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించలేదన్నారు. ఉద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని విమర్శించారు.

Latest Updates