కేసీఆర్ విధానాల వల్లే RTC కి నష్టాలు: జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లాలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన… ఆర్టీసీ నష్టాల్లో ఉందంటే.. అందుకు కారణం కేసీఆర్ ఫ్రభుత్వ తీరేనని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు 50వేల జీతం ఇస్తున్నామని కేసీఆర్ అనడం సిగ్గుచేటని పై అధికారులకు ఇస్తే అందరికీ ఇచ్చినట్టేనా అని ప్రశ్నాంచారు. ఈ మాట అనడానికి సిగ్గుండాలని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీతో పెట్టుకుంటే అగ్గిపెట్టెతో పెట్టుకున్నట్ట్ నని కసీఆర్ అన్నారని మరి ఇప్పుడు ఆయన చేసేది ఏంటని జీవన్ రెడ్డి అన్నారు. అధికారం లో ఉండబట్టి ఐదేండ్లు అవుతున్నా… ఇప్పటివరకు RTC ఎండీని నీయమించలేదని చెప్పారు. పక్కరాష్ట్రపు ఏపీ సీఎం జగన్ మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉత్తర్వులుజారీ చేశాడని అన్నారు. కేసీఆర్ మాత్రం ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు చూస్తున్నాడని అన్నారు.

కేసీఆర్ అయితే 1st కి జీతం తీసుకొని పండగ చేసుకుంటున్నాడని..  ఆర్టీసీ కార్మికుల జీతాలు మాత్రం ఇవ్వడలేదని…  వాళ్ళు పండగ చేసుకోవద్దా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 9000 వేల ఉద్యోగాలు కాలి ఉన్నాయని  ఇంతవరకు ఒక్క నియామకం చేయలేదని ఇదంతా….కేసిఆర్ కావాలనే చేస్తున్నాడని అన్నారు.

Latest Updates