తెలంగాణ విమోచనం సర్ధార్ పటేల్ గొప్పతనం కాదు: MLC జీవన్ రెడ్డి

జగిత్యాల: కాంగ్రెస్ లీడర్, MLC జీవన్ రెడ్డి తెలంగాణ విమోచన దినాన్ని జాతీయ జెండా ఎగురవేసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా జగిత్యాలలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ.. తెలంగాణ విమోచనం సర్ధార్ పటేల్ గొప్పతనం కాదని ఆనాటి కేంద్ర క్యాబినెట్ నిర్ణయంతోనే పటేల్ హైదరాబాద్ ను దేశంలో విలీనం చేసుకున్నారని చెప్పారు.

కుల మతాలకతీతంగా అన్ని వర్గాలవారి పోరాట ఫలితమే నేటి తెలంగాణ విమోచన దినమని అన్నారు జీవన్ రెడ్డి. బ్రిటిష్ హయాంలోని రాచరిక పాలనకు స్వస్తి పలకడానికిగాను,నాటి యోధులు చేపట్టిన ఉద్యమ పోరాటం ఫలితం గొప్పదని కొనియాడారు. విలీన దినాన్ని.. కొన్ని రాజకీయ పార్టీ లు కులాలకు, వ్యక్తులకు, మతాలకు ఆపాదిస్తూ మతతత్వ శక్తులను ప్రేరేపిస్తున్నారని అన్నారు.

Latest Updates