మేఘా సంస్థ దోపిడీపై కేసీఆర్ సమాధానం చెప్పాలి: నాగం

మేఘా కాంట్రాక్ట్ సంస్థ దోపిడీపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి. హవాలా రూపంలో చెల్లింపులు ఏంటని ప్రశ్నించారు. ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతి జరిగిందని.. సబ్ కాంట్రాక్టుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 3 లక్షల కోట్ల అప్పులు చేసి… నిధులు ఏం చేశారన్నారు నాగం. డబ్బులివ్వకనే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లారని… దోచుకున్న డబ్బును సీఎం వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవినీతి సీఎంను ప్రజలు డిస్మిస్ చేయాలని కోరారు నాగం.

Latest Updates