మంత్రి ఓటును క్యాన్సిల్ చేయాలంటూ ఎన్నికల కమిషన్ కు లేఖ

రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు మంత్రి గంగుల కమలాకర్ పై ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ లీడర్ నిరంజన్. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి కారుగుర్తుకు ఓటేయాలని  బహిరంగంగా కమలాకర్ ప్రకటించాడని అన్నారు నిరంజన్.  అందుకుగాను చర్యలు తీసుకోవలసిందిగా లేఖ రాశారు.

శుక్రవారం కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికలు జరుగుతున్నప్పుడు..  42 వ డివిజన్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న గంగుల కమలాకర్  పోలింగ్ స్టేషన్ లో వున్న ఓటర్లతో మాట్లాడుతూ..నేను కారు గుర్తుకు ఓటు వేశాను మీరందరూ కారు గుర్తుకే ఓటు వేయాలని బహిరంగంగానే కోరారని లెటర్ లో తెలిపారు.  కావున ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి గంగుల కమలాకర్ పై నియమావళి ప్రకారం ఆయన ఓటును పరిగణలోకి తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని… కరీంనగర్ కార్పొరేషన్ లో మళ్ళీ ఎన్నికలు జరపాలని కాంగ్రెస్ పార్టీ తరపున కోరుచున్నామని నిరంజన్ చెప్పారు.

Latest Updates