రామ మందిర నిర్మాణాన్ని స్వాగతిస్తున్నాం: కాంగ్రెస్

అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని చెప్పారు ఆ పార్టీనాయకులు రణ్ దీప్ సుర్జీవాలా. ఢిల్లీ లో మీడియాతో మాట్లాడిన ఆయన… రామ మందిర నిర్మాణాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. సుప్రీం ఇచ్చిన తీర్పు రామ మందిర నిర్మణంతో పాటు బీజేపీ చేస్తున్న రాజకీయాలకు స్వస్తి చెప్పేలా ఉందని ఆయన అన్నారు.

అయోధ్య వివాదాస్పద స్థలాన్ని హిందువులకు చెందినదిగా తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు. ముస్లింలకు ఐదెకరాల భూమిని కెటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే అన్ని మతాల పెద్దలు సుప్రీం తీర్పును స్వాగతించారు. దేశంలో ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు.

Latest Updates