వరుసగా హెరిటేజ్ బిల్డింగ్లో ప్రమాదాలు

వరుసగా హెరిటేజ్ బిల్డింగ్లో ప్రమాదాలు

సికింద్రాబాద్ క్లబ్ లో జరిగిన ప్రమాదంపై విచారణ చేయాలన్నా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్. హెరిటేజ్ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం జరగడం బాధాకరమన్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా హెరిటేజ్ బిల్డింగ్ లో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. వాటిని కాపాడాలని కోరారు వీహెచ్. సికింద్రాబాద్ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ,హెరిటేజ్ భవనాలు పై నిఘా పెట్టాలన్నారు. చారిత్రాత్మక కట్టడాలు పై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరైంది కాదన్నారు వీహెచ్. 

ఇకపోతే సికింద్రాబాద్ క్లబ్ లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో  క్లబ్ పూర్తిగా తగలబడి పోయింది. తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో  క్లబ్ పూర్తిగా కాలిపోయింది. వెంటనే ఫైర్ ఇంజిన్లుతో మంటలు ఆర్పివేశారు సిబ్బంది.  షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందని చెప్తున్నారు స్థానికులు. సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్ రఘురామ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని  షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామన్నారు.  మొత్తం 7 ఫైర్ ఇంజన్లు స్పాట్ కి కేవలం 15 నిమిషాల్లోనే రీచ్ అయ్యాయన్నారు.. క్లబ్ ముందు భాగం మొత్తం కూడా కలప , చెక్క తో కూడి ఉంది కాబట్టి ఈ స్థాయిలో ప్రమాదం జరిగిందన్నారు. ఎంత మేరకు అస్తి నష్టం జరిగిందన్న విషయంపై భవనం ఇంజనీర్, ఆర్కిటెక్చర్ ఇంజనీర్ ద్వారా అంచనా వేస్తారన్నారు. 

ఇవి కూడా చదవండి: 

సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం

ఫాస్ట్ ఫుడ్ లేదన్న షాపు ఓనర్.. కత్తితో దాడి