ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత షేక్ మస్తాన్ వలి కుమారుడు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా: రోడ్డు ప్రమాదంలో కుమారుడుని పోగొట్టుకున్న ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలిని కాంగ్రెస్ పెద్దలు పరామర్శించారు. చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో కుమారుడి మృతదేహం కోసం వేచి ఉన్న మస్తాన్ వలి వద్దకు ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, టిపిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్,రాంరెడ్డి దామోదర్ రెడ్డి తదితరులు వెళ్లి కలిశారు. నిన్న రాత్రి గుంటూరు నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా.. మార్గం మధ్యలో చౌటుప్పల్ వద్ద ఆగిన మస్తాన్ వలి కుమారుడు షేక్ ఫారుక్ (22)ను కారు వేగంగా వచ్చి ఢీకొంది. చలి వేస్తుండడంతో స్వెట్టర్ వేసుకునేందుకు ఆగిన ఫారుక్ బైకుపై ఉండగా.. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వచ్చి ఢీకొనడంతో ఎగిరిపడ్డాడు. తీవ్ర రక్తగాయాలు కావడంతో మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి హుటాహుటిన చౌటుప్పల్ కు తరలివచ్చారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం గుంటూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చౌటుప్పల్ ఆస్పత్రి వద్ద తీవ్రమైన విషాదంలో ఉన్న మస్తాన్ వలి కుటుంబీకులను కాంగ్రెస్ నేతలు కలసి ఓదార్చారు. తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తనని తానే కిడ్నాప్ చేసుకొని రూ. 50 కోట్లు డిమాండ్ చేసిన 15 ఏళ్ల బాలుడు

https://www.v6velugu.com/minor-boy-kidnapped-himself-and-demands-rs-50-cr-from-his-family/

పెద్ద టీవీలకు ఫుల్ గిరాకీ

https://www.v6velugu.com/full-demand-for-big-tv/

యూట్యూబ్‌ లో కొత్త ఫీచర్‌

https://www.v6velugu.com/new-feature-in-youtube/

Latest Updates