లవ్ మ్యారేజ్ కి ఒప్పుకోలేదని.. భార్య, అల్లుడే హత్యచేశారు

ఇందల్వాయి, వెలుగు : నిజామాబాద్ జిల్లా ఇందల్వా యి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్  నాయకుడు డీపీ గంగారాం డెత్ మిస్టరీ వీడింది. కూతురి లవ్ మ్యారేజీకి ఒప్పుకోలేదనే కక్షతో భార్య, అల్లుడే హత్య చేసినట్లు ఇందల్వాయి ఎస్సై శి వప్రసాద్‌‌‌‌రెడ్డి శుక్రవారం ప్రెస్ మీట్ లో వివరాలు వె ల్లడించారు. గంగారాం ఈ నెల 9న ఆదివారం రాత్రి హత్యకు గురి కాగా, ఈ కేసులో నలుగురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో మృతుడి అల్లుడు దామ శ్రీకాంత్‌ ‌‌‌అలియాస్‌‌‌‌ గొడుగు రాజు ఏ1, సీతపట్ల గణేష్ ఏ2, ఆసది శేఖర్‌‌ ఏ3, మృతుడి భార్య రామ లక్ష్మి ఏ4 నింది తులుగా చేర్చినట్లు వివరించారు.

 లవ్ మ్యారేజీకి ఒప్పుకోలేదని..

గంగారాం ఒక్కగానొక్క కూతురు శ్రుతి, దామ శ్రీకాంత్‌‌ అలియాస్‌‌ ‌‌గొడుగు రాజు ఆరు నెలల కింద లవ్‌‌మ్యారేజ్‌ ‌‌‌చేసుకున్నారు. వారి లవ్ మ్యారేజ్ కు ఒప్పుకోని గంగారాం.. భార్య రామలక్ష్మి, కూతురు శ్రుతికి దూరంగా ఉంటున్నాడు. దీంతో కొన్ని నెలలుగా మృతుడి భార్య రామలక్ష్మి, అల్లుడు రాజు కక్ష పెంచుకున్నారు. గంగారాంను చంపేయాలని నిర్ణయించుకుని, అదే గ్రామానికి చెందిన సీతాపట్ల గణేష్ అనే వ్యక్తికి రూ.90 వేలు ఇస్తామని చెప్పి హత్యకు ప్లాన్‌‌ చేశారు. ఇందుకు రాజు, గణేష్‌ ‌గ్రామానికి చెందిన ఆసది శేఖర్‌‌అనే మరో వ్యక్తిసాయం తీసుకున్నారు. శేఖర్‌‌కు బైక్‌‌కొని ఇచ్చి, గంగారాం కదలికలపై నిఘా ఉంచాలని చెప్పారు. ఆదివారం రాత్రి పొలం నుంచి గంగారాం బయల్దేరిన విషయం శేఖర్‌‌ఫోన్‌ ‌చేసి గణేష్ కు చెప్పాడు. దారి మధ్యలోకి అతడు చేరుకోగానే బండతో దాడి చేసి తల పగులగొట్టి చంపేశారు. కాగా, గంగారాం కూతురు శ్రుతి ప్ర స్తుం గర్భవతి. తండ్రి హత్యకు గురై చనిపోగా, భర్త, తల్లిఈ కేసులో నిందితులుగా రిమాండ్‌‌‌‌లో ఉన్నారు.

Latest Updates