రిపబ్లిక్ వేడుకల్లో కొట్టుకున్నకాంగ్రెస్ నేతలు

రిపబ్లిక్ డే రోజున  ఇద్దరు కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని పార్టీ కార్యాలయంలో  రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా జరిగింది. జెండా ఎగురవేసేటపుడు ఇద్దరు కాంగ్రెస్ నాయకులు దేవేంద్ర సింగ్ యాదవ్ , చందు కుంజీర్ గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు.  తర్వాత పోలీసులు జోక్యం చేసుకోవడంతో సద్గుమణిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గొడవ తర్వాత దేవేంద్ర సింగ్ యాదవ్ చందు కుంజీర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.