ఉద్యోగులకు డీఏ, డీఆర్ నిలిపివేతపై కాంగ్రెస్ ఫైర్

న్యూఢిల్లీ: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు డీఏ, డీఆర్ పెంపు, ఏరియల్స్ ను నిలిపి వేయడంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్సింగ్ లో పాల్గొన్నారు. కష్టకాలంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగులు, ఆర్మ్డ్ ఫోర్సెస్ పై ఇలాంటి భారం వేయాల్సిన అవసరం లేదని మన్మోహన్ సింగ్ తెలిపారు. వారి తరఫున మనం నిలబడాల్సిన సమయం ఇదన్నారు. రాహుల్ గాంధీ దీన్నో అమానవీయ చర్యగా పేర్కొన్నారు. సెంట్రల్ విస్టా సుందరీకరణ కోసం చేస్తున్న దుబారాగా ఖర్చు చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. సెంట్రల్ విస్టాను ఇప్పుడే నిర్మిస్తున్నారని.. దానికయ్యే దుబారా ఖర్చు గురించి ఆలోచించరని మండిపడ్డారు. మిడిల్ క్లాస్ నుంచి డబ్బులు తీసుకొని పేద ప్రజానీకానికి ఇవ్వట్లేదన్నారు. ఆ డబ్బులను సెంట్రల్ విస్టా కోసం వెచ్చిస్తున్నారని దుయ్యబట్టారు. బుల్లెట్ ట్రెయిన్, సెంట్రల్ విస్టా డెవలప్ మెంట్ పై వెనక్కి తగ్గని కేంద్రం ఉద్యోగుల డీఏను మాత్రం కత్తెర వేసిందని.. ఫస్ట్ ఆ రెండు ప్రాజెక్టులకు డబ్బులు నిలిపేయాలని చిదంబరం చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్ నెస్ అలవెన్స్ (డీఏ), డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) పెంపును నిలిపేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ డెసిషన్ తీసుకున్నట్లు కేంద్రం ఓ మెమొరాండంలో తెలిపింది. ఏరియర్స్ కూడా పే చేయబోమని తెలిపింది. దీని వల్ల 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు కలిపి రూ.37,350 కోట్లను మిగిల్చుకోవాలని కేంద్రం అనుకుంటోంది. సెంట్రల్ విస్టా రీడెవలప్ మెంట్ కోసం రూ.20 వేల కోట్లు, అహ్మదాబాద్ నుంచి ముంబై కి బుల్లెట్ ట్రెయిన్స్ రూట్ నిర్మాణానికి కు రూ.5,600 కోట్లను కేంద్రం కేటాయించింది.

Latest Updates