కాంగ్రెస్ లీడర్లూ సిగ్గు పడండి

‘‘జమ్మూకాశ్మీర్ కు స్పెష ల్ స్టేటస్ కల్పిం చే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించింది. కాశ్మీర్ పై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్​కు పాకిస్తాన్ నుంచి ప్రశంసలు కూడా అందాయి.యునైటెడ్ నేషన్స్​లో వేసిన పిటిష న్ లో ఆయన కామెంట్స్​ను పాక్​ వాడుకుంది. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ కు.. కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలు ఉపయోగపడుతున్నాయి. మీరంతా సిగ్గుపడండి” అని బీజేపీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్​షా మండిపడ్డా రు. దాద్రా, నగర్‌ హవేలిలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఆర్టికల్ 370 రద్దు నిర్ణయానికి ప్రజలు సపోర్టు చేశారు. కానీ కొందరు మాత్రం ఇప్పటి కీ వ్యతిరేకిస్తున్నారు”అని విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాతకాశ్మీర్ లో హింస పెరిగిపోయిందని, ప్రజలు చనిపోతున్నారని రాహుల్ గాంధీ స్టేట్ మెం ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇండియాకు వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్​లో పిటిష న్ వేసిన పాకిస్తాన్..రాహుల్ కామెంట్స్​ను అందులో పేర్కొంది. దీనిపై షా విమర్శలు గుప్పించారు.

పాకిస్తాన్ మాదిరి మాట్లా డుతారు…

‘‘ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇండియా వ్యతిరేక నినాదాలు చేసిన వ్యక్తుల వైపు కాంగ్రెస్ నిలబడింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం సర్జికల్ స్ర్టైక్స్ చేసినప్పుడు.. అనుమానాలు వ్యక్తం చేసింది. ఆధారాలు అడిగింది. ‘ఫొటోలు పండి, వీడియోలు చూపండి’ అని ప్రశ్నించింది. అచ్చం గా పాకిస్తాన్ అడిగినట్లే” అని షా మండిపడ్డారు.

దేశ ప్రయోజనాలపై రాజకీయాలా?…

జాతి ప్రయోజనాల విషయంలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించడాన్ని షా తప్పుబట్టారు.సంప్రదాయాన్ని కాంగ్రెస్ బ్రేక్ చేస్తోందని ఆరోపించారు. ‘‘పాకిస్తాన్, చైనాలతో యుద్ధం కావొచ్చు, లేదా జమ్మూకాశ్మీర్ పై చేసిన తీర్మానం కావచ్చు. నేషనల్​ఇంట్రెస్టులు ఏవైనా సరే భారతీయ జనసంఘ్, తర్వాత బీజేపీ.. ప్రభుత్వాన్ని సపోర్టు చేసేవి. ఇది సంప్రదాయంగా వస్తోంది. జాతీయ ప్రయోజనాల సమస్య తలెత్తినప్పుడు పార్టీలు, రాజకీయాలకు అతీతంగా, దేశాన్ని దృష్టిలో ఉంచుకుని స్పందించాలి. కానీ మీరు (కాంగ్రెస్) సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తున్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ మీరు చేస్తున్నప్పుడు..ప్రజలు కూడా మీకు అలానే సమాధానం చెబుతారు” అని ఫైర్ అయ్యారు.

70 ఏళ్లలో ఎవరూ తీసుకోలేదు

‘‘గతంలో ఎప్పుడూ, ఎవ్వరూ తీసుకోని నిర్ణయం మోడీ తీసుకు న్నారు. 70 ఏళ్లు గడిచిపోయాయి. మూడు తరాలు పాలించాయి. కానీ ఎవరూ ఆర్టికల్ 370ని రద్దు చేయలేదు. అందుకే ప్రజలు ప్రధాని మోడీని ఆశీర్వదిస్తు న్నారు” అని షా వివరించారు. దాద్రా, నగర్‌ హవేలిలోని సిల్వస్స పర్యటనలో భాగంగా షా.. 61కోట్లతో నిర్మి స్తు న్న ఎడ్యుకేషనల్ హబ్ కు శంకుస్థాపన చేశారు.

Latest Updates