Loksabha elections 2024 results:యూపీలో కాంగ్రెస్ లీడింగ్ 

Loksabha elections 2024 results:యూపీలో కాంగ్రెస్ లీడింగ్ 

దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.అధికార, ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి.  బీజేపీ కూటమి NDA హాప్ మార్క్ ను దాటింది. అయితే ప్రతిపక్ష కూటమి INDIA కూడా బలమైన స్థితిలో ఉంది.బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్ ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో ఉంది.  ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో బీజేపీకి గట్టి పోటీ నిస్తోంది. యూపిలో 80  లోక్ సభ సెగ్మెంట్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అత్యధికంగా 65 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే అందుకు విరుద్ధంగా కౌంటింగ్ ఫలితాలు చూపిస్తున్నాయి. ఇండియా కూటమికి 45 సెగ్మెంట్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీకూటమికి కేవలం35 సీట్లలో ఆధిక్యంలో ఉంది.  

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కౌంటింగ్ లో కాంగ్రెస్ కీలక నేతలు ముందంజలో ఉన్నారు. కేరళలోని వయనాడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ లీడ్ లోఉన్నారు. రాహుల్ గాంధీ 52 వేలకు పైగా ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. యూపీలో కీలకమైన అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ శర్మ లీడ్ లో ఉన్నారు బీజేపీ అమేథీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ 10వేల ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. మరోవైపు పాటియాల, పంజాబ్ లోని సంగ్రూర్,  లోక్ సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీలు ప్రణీత్ కౌర్, సిమ్రంజిత్ సింగ్ మాన్ వెనకంజలో ఉన్నారు.