కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి.. 28 స్థానాలు ఖాళీ

కరోనా బారినపడి మధ్యప్రదేశ్‌కి చెందిన ఎమ్మెల్యే ఒకరు మృతిచెందారు. రాజ్‌ఘర్ జిల్లాలోని బియోరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోవర్దన్ డాంగీ కరోనాతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు ఆగష్టు 25న కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆయన భోపాల్‌లోని చిరాయు మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న డాంగీ.. మంగళవారం ఉదయం చనిపోయారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ట్వీట్ చేసింది.

ఇప్పటికే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పది మంది మంత్రులు, 28 మంది ఎమ్మెల్యేలు కరోనా బారినపడిన వారిలో ఉన్నారు. గోవర్దన్ మృతితో మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 28 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటన్నింటికి త్వరలోనే బైఎలక్షన్ నిర్వహించనున్నారు.

For More News..

14 ఏండ్లలోపు పిల్లలకు, సీనియర్ సిటిజన్లకు ఫ్రీ హెయిర్‌కట్

రేప్ చేసిన వాళ్లకు కొత్త శిక్షను సూచించిన పాక్ ప్రధాని

అప్పు చెల్లించలేదని కిడ్నాప్ చేసి కొట్టిన హైదరాబాద్ కార్పొరేటర్

Latest Updates