హరీష్ దగ్గర శాఖ మాత్రమే ఉంది.. నిధుల్లేవ్

ఆర్థిక మంత్రి హరీష్ రావు దగ్గర కేవలం ‌శాఖ మాత్రమే ఉన్న‌దని, నిధులు లేవని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి. లాక్ డౌన్ సమయంలో ప్ర‌భుత్వం ఇవ్వాల్సిన 15వందల రూపాయలు ఇంకా 40శాతం రావాల్సి ఉంద‌ని అన్నారు. గురువారం అసెంబ్లీ వ‌ద్ద ప్రెస్ మీట్ నిర్వహించిన జ‌గ్గారెడ్డి…‌ ఆర్థిక మంత్రి అయ్యాక హరీష్ రావు రైతులతో మీటింగ్‌లే పెట్ట‌లేద‌న్నారు. ఫైనాన్స్ మినిష్టర్ కాస్త‌ ఫ్రీడోనర్ మినిష్టర్ గా మారారని విమర్శించారు. సంగారెడ్డికి ఎపుడు వచ్చినా హ‌రీష్ రావు రైతుబంధు గురించి మాట్లాడడ‌ని అన్నారు. ఇకనుంచి ఎప్పుడు సంగారెడ్డికి వచ్చినా తాను రైతుబంధు కోసం నిలదీస్తాన‌ని చెప్పారు జ‌గ్గారెడ్డి. హరీష్ రావు సమావేశాలకు త‌న‌ ప్రోటోకాల్ ప్రకారం హాజరు అవుతాన‌ని, సంగారెడ్డి జిల్లా రైతుల పక్షాన సమావేశంలోనే హరీష్ రావును నిలదీస్తాన‌ని అన్నారు.

Latest Updates