క‌రోనా బాధితుల కోసం రూ.5 వేల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలి

కరోనా బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి . కరోనాను కట్టడి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయటం లేదన్నారు. క‌రోనా విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌ల‌కు , అమ‌లుకు పొంత‌న లేద‌ని అన్నారు.

గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… కరోనా బాధితుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం తక్షణమే 5 వేల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని డిమాండ్ చేశారు. గాంధీ ఆస్పత్రికి 3 వేల కోట్లు.. మిగిలిన జిల్లా ఆస్పత్రులకు 2 వేల కోట్లు కేటాయించాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చిన విరాళాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

సీఎం సొంత జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేకపోవటం సిగ్గుచేటని చెప్పిన జ‌గ్గారెడ్డి… సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో వెంటిలేటర్స్ సైతం అందుబాటులో లేవని చెప్పారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమో.. కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ ముఖ్యమో ప్రభుత్వ పెద్దలు తేల్చుకోవాలని సూచించారు. గ్రామాల్లో సైతం కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావటం ఆందోళనకరంగా ఉందన్నారు. రానున్న రెండు నెలలు ప్రజలకు చాలా కీలకమని జగ్గారెడ్డి అన్నారు.

Jagga reddy

Latest Updates