కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డే దిక్కు : జగ్గారెడ్డి

రేవంత్ రెడ్డి మరో పవర్ సెంటర్ అని జరిగే ప్రచారంలో తప్పులేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ ఎంత బలపడితే కాంగ్రెస్ కి అంత బలమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

పార్టీలో వ్యక్తిగతంగా ఎవరు ఎదిగినా అది కాంగ్రెస్ కే మేలవుందన్న ఆయన .. అన్ని కులాలు, మతాలకు సంబందించిన బలమైన నాయకత్వం ఉందని చెప్పారు. కాంగ్రెస్ లో రేవంత్ వ్యక్తిగతంగా ఎదగాలని అనుకోవడంలో తప్పులేదని వ్యాఖ్యానించారు.  రేవంతే కాదు..భట్టి, శ్రీధర్ బాబు..దామోదర రాజనర్సింహ.. ఎలా ఎవరైనా వ్యక్తిగతంగా ఎదగొచ్చని, పార్టీలో  సింగిల్ హీరో ఉండరన్నారు. వ్యక్తిగతంగా ఏ నాయకుడు ఎదిగినా… అల్టిమేట్ గా గాంధీభవనే శాసిస్తుందన్నారు. కాంట్రవర్సీ లో లేని నాయకులే పీసీసీలవుతారని… శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి లే వివాదరహితులేనని స్పష్టం చేశారు.

కాంట్రవర్సీ లో ఉన్న నాయకులు పీసీసీ పరిశీలన జాబితాలో మాత్రమే ఉంటారని.. పీసీసీ నియామకం డబ్బుతో సంబంధం ఉండదన్న జగ్గారెడ్డి.. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా అధిష్టానం పీసీసీ పదవి ఇవ్వదన్నారు.

ఎన్ కౌంటర్ ను సమర్ధిస్తున్నా

కేసీఆర్, జగన్, నేను ఆడపిల్ల తండ్రిగా  ఎన్ కౌంటర్ ను సమర్ధిస్తున్నట్లు చెప్పారు. 21 రోజుల్లో శిక్ష పడేలా చట్టం చేస్తా అని జగన్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ కూడా అలాంటి చట్టం తెచ్చేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందున్నారు.

Latest Updates