3 నెలల పాటు రాజకీయాల గురించి మాట్లాడను: కాంగ్రెస్ ఎమ్మెల్యే

వచ్చే మూడు నెలలు రాజకీయాల గురించి మాట్లాడనని, మే తరువాతే అప్పటి రాజకీయ పరిస్థితిని బట్టి మాట్లాడతానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ మూడు నెలలు సంగారెడ్డి ప్రజల సమస్యలపైనే మాట్లాడతానని చెప్పారు. సంగారెడ్డి నియోజకవర్గంలో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, స్థానిక మహిళలతో పాటు మద్యం అలవాటు లేని వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు.  త్వరలో తన నియోజకవర్గంలో మద్యపాన నిషేధ ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన చేసే పనిలో ఉన్నానన్నారు.

లిక్కర్, బీర్ నిషేధించాలని సంగారెడ్డి ప్రజలు కోరుకుంటున్నారని, నియోజకవర్గంలో ఉన్న బీర్ల కంపెనీల నుండే తన ఉద్యమం ప్రారంభిస్తానన్నారు జగ్గారెడ్డి. రాష్ట్రంలో జరిగే ఎన్నో నేరాలకు మద్యమే కారణమన్నారు. మత్తు మనిషిని రాక్షసుడిలా మార్చుతుందని, మద్యం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు.

congress-mla-jagga-reddy-talks-about-liquor-ban-in-his-constituency

Latest Updates