టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డమ్మీగా మారారు

అధికారంలో సొంత‌ పార్టీ ఎమ్మెల్యేలున్నా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌టం లేదని టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డమ్మీగా మారారని ఎద్దేవా చేశారు. సింగూరు, మంజీర జలాలను తరలిస్తుంటే.. సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకోలేకపోయారని ధ్వజమెత్తారు. సీఎం తుమ్మి‌నా, ద‌గ్గినా కాదు… స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తే బ‌ల్ల‌లు చ‌ర‌వండి అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పై జ‌గ్గారెడ్డి సెటైర్స్ వేశారు. త‌న నియోజ‌వ‌క‌ర్గంలో 40వేల మంది ఇండ్ల ప‌ట్టాలు, నిరుద్యోగ భృతి, 57ఏళ్ల‌కే పెన్ష‌న్ హామీ ఏమైంద‌ని జ‌గ్గారెడ్డి ప్రశ్నించారు. మ‌రో 15 రోజుల్లో సంగారెడ్డిలో మెడిక‌ల్ కాలేజీపై హామీ నెర‌వేర్చ‌క‌పోతే ఐదు రోజుల దీక్ష‌కు దిగుతాన‌ని జ‌గ్గారెడ్డి ప్ర‌క‌టించారు.

 

Latest Updates