25 అంశాలపై సర్కార్ నిలదీద్దాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 25 అంశాలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీయాలని సీఎల్పీ నిర్ణయించింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం సోమవారం ఉదయం జరిగింది. కరోనా కేసులు, నదీ జలాల వివాదం, ఉద్యోగాల భర్తీ, కొత్త సచివాలయ నిర్మాణం, అక్రమ మైనిం గ్, అకాల వర్షా నికి పంట నష్టం , డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, కొత్త ఎడ్యుకేషన్ పాలసీ, నిరుద్యోగ భృతి, యూనివర్సిటీల సమస్యలు, భూరికార్డుల నిర్వహణలో తప్పిదాలు, హైదరాబాద్ పరిసర ప్రాంతా ల్లో భూ అమ్మకాలు, హైదరాబాద్‌‌‌‌లో రోడ్ల నిర్మాణం, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, శ్రీశైలం విద్యుత్ ప్రమాదం, దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ, ఎక్సైజ్ పాలసీ, పీఆర్సీ, సీపీఎస్ రద్దు, ఉద్యోగుల సమస్యలు, పోడు వ్యవసాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్, ప్రభుత్వ అప్పులు వంటి అంశాలు ఉన్నాయి.

 

Latest Updates