TRSకు పబ్లిసిటీ మీద ఉన్న శ్రధ్ద పనిపైన లేదు: జీవన్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద అవినీతి ప్రాజెక్ట్ అని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.  కాళేశ్వరం నుంచి ఇప్పటి వరకూ చుక్క నీరు వినియోగంలోకి రాలేదన్నారు  50 రోజుల నుంచి కాళేశ్వరం నీరు వృథాగా సముద్రంలోకి పోతుందన్నారు. రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపొసే ప్రాజెక్టు నుంచి ఇప్పటి వరకు 100 టీఎంసీల నీరు వృధాగా పోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ పెను భారమైందన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టారని ఆరోపించారు. జగిత్యాల జిల్లాలోని రోళ్లవాగు ఆధునికీకరణకు మూడేళ్ల క్రితమే టెండర్ల ప్రక్రియ చేపట్టినా ఇంతవరకు పనులు లేవన్నారు. టీఆర్ఎస్ కు పబ్లిసిటీ మీద ఉన్న చిత్తశుద్ధి నిర్మాణ పనుల మీద లేదన్నారు జీవన్ రెడ్డి.

Latest Updates