గిరిజన రిజర్వేషన్లపై సీఎం కృషి చేయాలి

గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచేలా సీఎం కేసీఆర్ కృషి చేయాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు రూపొందించి ఆమోదించాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించిందని.. జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పిందన్నారు. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ ఇస్తామని కేసీఆర్ గతంలో చెప్పారని తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి 50శాతం మించకూడదనే నిబంధన వర్తించదన్నారు.

ఇందిరా సహాని కేసులో రిజర్వేషన్లు 50శాతం మించకూడదని సుప్రీం కోర్ట్ చెప్పింది కానీ.. అది మన రాష్ట్రంలో వర్తించదని చెప్పారు. మన రాష్ట్రంలో ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్ మాత్రమే ఇస్తున్నందునా 4 శాతం నష్టపోతున్నారని తెలిపారు. మహారాష్ట్రలో 52 శాతం రిజర్వేషన్లు ఉండగా కూడా మరాటాలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించారని.. ప్రస్తుతం అక్కడ 64శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయన్నారు. సుప్రీమ్ కోర్ట్ కూడా మహారాష్ట్ర రియాజర్వేషన్ల లో జోక్యం చేసుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా సీఎం గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచేలా కృషి చేయాలని తెలిపారు జీవన్ రెడ్డి.

See Also: రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ పై ముగిసిన విచారణ

Latest Updates