మోడీపై సెటైర్.. రాహుల్‌కు కోర్టు పిలుపు

2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన విమర్శలు, ఇచ్చిన నినాదాలు ఆయన్ను న్యాయపరమైన చిక్కుల్లో పడేశాయి. ప్రధానమంత్రి తన ఐదేళ్ల కాలంలో దేశంలోని సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టారంటూ.. అనేక సభల్లో విమర్శించిన రాహుల్ … చౌకీదార్ చోర్ హై అనే స్లోగన్ ఇచ్చారు. పదే పదే ఆయన ప్రధానమంత్రి మోడీని చౌకీదార్ అంటూ విమర్శించడంపై మహేశ్ శ్రీశ్రీమాల్ అనే పిటిషనర్ ముంబైలోని కోర్టుకెక్కారు. మెజిస్ట్రేట్ కోర్టులో రాహుల్ పై పిటిషన్ దాఖలుచేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ.. రాహుల్ గాంధీని ముంబై మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది.

రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అని విమర్శలు చేయడంతో.. ప్రధాని మోడీ తన ట్విట్టర్ అకౌంట్ లో పేరుకు ముందు చౌకీదార్ అనే పేరు చేర్చారు. బీజేపీ నేతలంతా కూడా అదే దారిలో తమ పేర్లను చౌకీదార్ అంటూ మార్చేశారు. రాహుల్ చేసిన విమర్శనే.. ప్రచారాస్త్రంగా మల్చుకుంది బీజేపీ.

Latest Updates