హైదరాబాద్‌లో ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్ కొత్తపేటలో ధర్నాకు దిగిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్‌లోని వాసవీనగర్‌లో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. అయితే ట్యాంక్ ప్రారంభం చేయాల్సిన సమయానికన్నా ముందే వచ్చిన కేటీఆర్ ట్యాంకును ప్రారంభించి వెళ్లిపోయారు. దాంతో రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన రోడ్డుపై భైఠాయించారు. రోడ్డుపై టీఆర్ఎస్ జెండాలు చింపివేస్తూ కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు.  అందులో భాగంగా హైవేను దిగ్భందించారు. దాంతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

For More News..

డబుల్ బెడ్‌రూం ఇళ్లు అమ్మినా.. కిరాయికి ఇచ్చినా పట్టా రద్దు

గొర్రెల పంపిణీ మళ్లీ ప్రారంభించండి

సిడ్నీ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 244 ఆలౌట్

Latest Updates