కేసీఆర్ క‌న్నీళ్ల‌పై రేవంత్ అనుమానం : స‌్పందిచ‌క‌పోతే ఉద్యమ‌మేనని హెచ్చ‌రిక‌

నాగులు ఆత్మహత్యాయత్నం తీవ్రంగా కలచివేసిందని, తెలంగాణ ఉద్యమ కాలంలోని ఆత్మబలి దానాల్ని గుర్తుకు తెచ్చింద‌ని అన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. నాగులు ఆర్తనాదాలలో తెలంగాణ నిరుద్యోగ యువత గుండె చప్పుడు ఉందన్న రేవంత్ ..కేసీఆర్ కనికరం లేని ముఖ్యమంత్రి అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఉద్య‌మ స‌మ‌యంలో యువత శవాల వద్ద కేసీఆర్ కార్చింది కన్నీరా… ముసలి కన్నీరా..? అంటూ అనుమానం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ తీరుతో బలిదానాలు చేసుకున్న యువత ఆత్మలు ఘోషిస్తున్నాయ‌న్నారు.

కేటీఆర్ సూటూబూటూ వేసుకుని బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో ఫోటోలు దిగితే ఉద్యోగాలు వచ్చినట్టేనా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ హామీలు మీడియాలో హెడ్ లైన్స్ వచ్చాయి తప్ప… యువతకు ఉద్యోగాలు రాలేద‌ని దుయ్య‌బ‌ట్టారు.

నాగులుకు మెరుగైన వైద్యం ప్రభుత్వమే అందించాలి, ఉపాధికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యపై తక్షణ కార్యచరణ ప్రకటించాలన్న రేవంత్ రెడ్డి… కేసీఆర్ స్పందించకుంటే… నిరుద్యోగ యువత తరఫున త్వరలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఉద్యమం చేస్తామ‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు.

Latest Updates