హస్తం పార్టీకి చెందిన 687 ఫేక్ అకౌంట్లను తొలగించిన FB

లోక్​సభ ఎన్నికల వేళ కొత్త వివాదం తెరపైకివచ్చింది. కాంగ్రెస్​ పార్టీకి చెందిన 687 ఫేక్​ అకౌంట్లను రద్దు చేశామని ఫేస్​బుక్ సంస్థ ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం ఎఫ్​బీ ప్రకటనతో విబేధించింది. తమ వాలంటీర్ల పేజీలన్నీ సేఫ్​గా ఉన్నాయని, దీనిపై ఎఫ్​బీని వివరణ కోరతామని పేర్కొంది. ఇక బీజేపీఫేస్​ బుక్​ చర్యను చరిత్రాత్మక ముందడుగుగా కీర్తించింది. ఫేస్​బుక్ సైబర్ సెక్యూరిటీ పాలసీ హెడ్ నతానియెల్​ గ్రెయిషర్ సోమవారం చేసిన ప్రకటనతో ఈ వివాదం మొదలైంది. ఫేక్​ అకౌంట్లు సృష్టించి, వేర్వేరు గ్రూపుల్లో చేరి, పదే పదే ఎన్నికల అంశాలను ప్రస్తావించడం, ఎంపీ అభ్యర్థులపై అభిప్రాయాలు సేకరించడం, ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం తదితర చర్యలకు పాల్పడుతుండటాన్ని గుర్తించామని, ఆరా తీయగా ఆ అకౌంట్లన్నీ కాంగ్రెస్​ ఐటీ విభాగంలో పనిచేస్తున్న వారికి సంబంధించినవిగా తేలిందని నతానియెల్ ​మీడియాకు తెలిపారు. అయితే, ఐడీలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టే అకౌంట్లు రద్దుచేశాం తప్ప కంటెంట్​ విషయంలో ఎలాంటి అభ్యం తరాలులేవని పేర్కొన్నారు. ఎన్ని కల్లో అనుచిత లబ్దికి సోషల్​ మీడియా వేదిక కారాదన్న లక్ష్యానికి సంస్థ కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. కాంగ్రెస్​ అకౌంట్లతోపాటు పాకిస్థాన్ ఆర్మీ అక్రమంగా నిర్వహిస్తున్న మరో 103ఫేక్​ అకౌంట్లను కూడా రద్దుచేసినట్లు తెలిపారు.

కాంగ్రెస్ ను సంప్రదించాం..
అన్​ఎథికల్​ అకౌంట్లను గుర్తించిన తర్వాత కాంగ్రెస్​ ఐటీ సెల్ ప్రతినిధులను సంప్రదించామని, అయితే గుర్తింపును వెల్లడించేందుకు వాళ్లు నిరాకరించారని నతానియెల్​ చెప్పారు. ‘‘ఈ పేజీలన్నీ మా సంస్థవిధానాల్ని ఉల్లంఘించాయి. నకిలీ అకౌంట్లు , ఒకే పేరుతో వేర్వేరు అకౌంట్లు నిర్వహిస్తున్నారు. మాల్​వేర్ కు లింకుల్ని పోస్ట్​ చేయడం, యాక్టీవ్​గా ఉన్న ఇతర గ్రూపుల్లో చేరి భారీ ఎత్తున కంటెంట్​ను పోస్ట్​ చేయడం ద్వారా వాటికి అనుబంధంగా ఉన్న వెబ్సైట్లకు ట్రాఫిక్​ పెంచుతున్నారు. ట్రాఫిక్ పెరగడం ద్వారా యాడ్ల రూపంలో భారీ మొత్తంలో డబ్బును దండుకుంటున్నారు’’అని వివరించారు.

Latest Updates