కాంగ్రెస్సే అతిపెద్ద కరోనా

భయంకర కరోనా కాంగ్రెస్సే

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ విమర్శ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆగ్రహం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: దేశానికి పట్టిన భయంకరమైన కరోనా కాంగ్రెస్సే అని సీఎం కేసీఆర్ విమర్శించారు. శనివారం అసెంబ్లీలో కరోనాపై షార్ట్‌‌‌‌ డిస్కషన్‌‌‌‌కు సమాధానం చెప్తూ ఆయన ఈ మాటన్నారు. దీనిపై కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. మొదట షార్ట్‌‌‌‌ డిస్కషన్‌‌‌‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. చైనా కరోనాను కట్టడి చేసేందుకు 10 రోజుల్లో 10 వేల బెడ్ల హాస్పిటల్‌‌‌‌ కడితే కేంద్రం ప్రభుత్వం ఒక రింగ్‌‌‌‌టోన్‌‌‌‌ పెట్టి వదిలేసిందని విమర్శించా రు. ‘‘సీఎం ఒక్క పారాసిటమాల్‌‌‌‌ టాబ్లెట్‌‌‌‌తో ఇది నయమైపోతుందని చెప్పారు. 27 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే వైరస్‌‌‌‌ బతకదన్నారు. దీనిపై నేను డాక్టర్లను అడిగితే అదంతా తప్పు మన శరీరంలోనే 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని చెప్పారు. నేను మొదట సీఎం చెప్పిందే నిజమని భావించాను. రాష్ట్ర ప్రజలు కూడా అలాగే భ్రమిస్తారు” అని అన్నారు. ఆ వెంటనే రాష్ట్ర ప్రజలు అలాగే భావిస్తారు అంటూ సవరించుకున్నారు. భట్టి మాటలపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ‘‘అసలీ దేశానికి పట్టిన భయంకరమైన కరోనానే కాంగ్రెస్ పార్టీ. ఈ దరిద్రమెప్పుడు వదుల్తదో తెల్వదు. ఇప్పటికే వదిలింది” అని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. వారికి స్పీకర్‌‌‌‌ మైక్‌‌‌‌ ఇవ్వకపోవడంతో పద్దులపై మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌రెడ్డి స్పందించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌‌‌‌ పార్టీని కరోనాతో పోల్చడం బాధాకరమన్నారు. కరోనా పేరు చెప్పి తమను ఖతం చేస్తున్నారని మండిపడ్డారు. సోనియాగాంధీని గతంలో దేవత అన్న సభా నాయకుడు ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. సీఎం వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్‌‌‌‌ చేశారు.

కేసీఆర్‌‌‌‌ భూతవైద్యుడిలా మాట్లాడారు: భట్టి
సీఎం కేసీఆర్‌‌‌‌ కరోనాపై అసెంబ్లీలో ఓ ఆర్‌‌‌‌ఎంపీలా, భూతవైద్యుడిలా మాట్లాడారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యేలు రాజగోపాల్‌‌‌‌రెడ్డి, సీతక్కతో కలిసి మీడియా పాయింట్‌‌‌‌లో మాట్లాడారు. తెలంగాణకు కరోనా రావాలంటే గజ్జున వణుకుద్ది అని సీఎం అన్నారని, వ్యాధిపై సభలో పిట్ట కథలు చెప్పారని మండిపడ్డారు. బాలకృష్ణ సినిమాలో లాగా తొడగొడితే బిల్డింగులు కూలిపోవని, ఇది సినిమా కాదనే విషయం సీఎం గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అసెంబ్లీలో కాంగ్రెస్‌‌‌‌ పార్టీని కరోనాతో పోల్చడం ఏందని మండిపడ్డారు. సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌‌‌‌ చేశారు. ‘‘కరోనా కట్టడికి మాటలు చెప్తే సరిపోదు. కరోనా వచ్చిన వ్యక్తిని ప్రజలకు దూరంగా ఉంచాల్సిందిపోయి నగరం నడిబొడ్డున గాంధీ హాస్పిటల్‌‌‌‌లో ఎలా ఉంచుతారు” అని ప్రశ్నించారు.

కరోనా బాధితుడ్ని దరిద్రుడు అంటావా: రాజగోపాల్ రెడ్డి
​కరోనా వచ్చిన వ్యక్తిని దరిద్రుడు అంటూ సీఎం అనడం ఏమిటని ఎమ్మెల్యే రాజగోపాల్‌‌‌‌రెడ్డి మండిపడ్డారు. ‘‘అప్పట్లో ఢిల్లీలో సోనియాగాంధీతో కలిసి ఫొటోలు దిగి, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను విలీనం చేస్తామని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్‌ను కరోనా అంటావా”అని దుయ్యబట్టారు. ‘‘కరోనాపై మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడితే సీఎం కేసీఆర్ గాలి మాటలు అన్నడు.. కరోనా మన దేశానికే రాదు అన్నడు.. కరోనా లేదు కాకరకాయ లేదు అన్నడు. ఇప్పుడు ఇట్ల మాట్లాడుతున్నడు. ప్రజలు భయంతో చనిపోరు.. ముందు జాగ్రత్తలు తీసుకోకపోతేనే వైరస్‌‌‌‌ సోకి చనిపోతరు” అని ఎమ్మె ల్యే
సీతక్క పేర్కొన్నారు.

Latest Updates