కేసీఆర్ గారూ.. మీరూ కొట్టుకపోకముందే పరిస్థితిని చక్కదిద్దండి

నాలాల్లో పడి చనిపోయిన వారి లెక్కతీస్తే గిన్నిస్ రికార్డవుతుంది

మీ సర్కారు నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు బలైపోవాలి

గత ఆరేళ్ళలో మీ ప్రభుత్వం చేసిందేంటి?

నాలాలో పడి చనిపోయిన సుమేధ మృతిపై స్పందించిన విజయశాంతి

నగరంలో గురువారం కురిసిన భారీ వర్షాలకు దీనదయాళ్‌నగర్‌ ఓపెన్ నాలాలో సుమేధ అనే 12 ఏళ్ళ విద్యార్థిని పడి చనిపోయంది. ఆ ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సీనియర్ నటి విజయశాంతి ఘాటుగా స్పందించారు. వర్షాలు పడినప్పుడల్లా నగరంలో నాలాలు పొంగిపొర్లుతూనే ఉన్నాయని ఆమె అన్నారు. నాలాల్లో పడి ప్రతిసంవత్సరం చాలా మంది చనిపోతున్నారని.. అలా జరిగినప్పుడల్లా టీఆర్ఎస్ లీడర్లు వచ్చి మళ్లీ ఇలా జరగకుండా చూస్తామని చెప్పి వెళ్లడం మామూలైపోయిందని ఆమె అన్నారు. మ్యాన్ హోల్స్‌లో పడి చనిపోయిన వాళ్ల లెక్కతీస్తే గిన్నిస్ రికార్డు అవుతుందని ఆమె అన్నారు. వర్షాల వల్ల నగరవాసులు పడుతున్న ఇబ్బందులపై స్పందిస్తూ ఆమె చేసిన ట్వీట్ మీకోసం యదావిధిగా..

‘కేసీఆర్ గారూ… మీ సర్కారు నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు బలైపోవాలో చెప్పండి. సికింద్రాబాద్‌లో వర్షాలకు పొంగిపొర్లిన దీనదయాళ్‌నగర్‌ ఓపెన్ నాలాలో సుమేధ అనే 12 ఏళ్ళ విద్యార్థిని జీవితం కరిగిపోయింది.

విశ్వనగరం చేస్తామంటూ మీరు చెప్పుకుంటున్న జంటనగరాల్లో వర్షాలు పడినప్పుడల్లా నాలాలు, డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ కనిపించనంతగా నీరు నిండిపోయి ఎన్ని ప్రాణాలు బలైపోయాయో లెక్క తీస్తే ఒక గిన్నిస్ రికార్డు అవుతుంది.

ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడల్లా మీ పార్టీ నేతలు రావడం, ఇలా జరక్కుండా చూస్తామని హామీలిచ్చి వెళ్ళడం మామూలైపోయింది. వర్షాలు పడినప్పుడల్లా హైదరాబాదులో పలు ప్రాంతాలు నీట మునిగిపోవడం పాత ప్రభుత్వాల పుణ్యమేనని గతంలో మీరు ఎన్నోసార్లు విమర్శించారు. మరి గత ఆరేళ్ళలో మీ ప్రభుత్వం చేసిందేంటి?

ఇప్పుడు రాష్ట్రంలోని పలు ఇతర పట్టణాలు, నగరాలు హైదరాబాదు నగరానికి తోడవుతున్నాయి. అడుగడుగునా కబ్జాలు, అక్రమ కట్టడాలతో ఆ ప్రాంతాలు కూడా చినుకు పడితే చాలు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. ప్రజల ఆగ్రహ వెల్లువలో మీరూ కొట్టుకపోకముందే మేలుకుని పరిస్థితిని చక్కదిద్దండి’ అని ఆమె ట్వీట్ చేశారు.

For More News..

అప్పు చెల్లించడానికి వెళ్లిన మహిళపై అత్యాచారం.. సోషల్ మీడియాలో వీడియో అప్‌లోడ్..

వీడియో: మోడీ బర్త్‌డే వేడుకలు చేయబోతే.. పేలిన హీలియం బెలూన్లు

వీడియో: ఒక కాలు లేకున్నా.. ఒంటికాలుతో పొలం పనులు

Latest Updates