‘ఈ గెలుపు వారి అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల కాదు’

కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పొంగిపోదు… ఓడితే కుంగిపోదన్నారు ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసి కొందరు ఉప్పొంగిపోతున్నారని, తమ పార్టీ ఎన్నో  ఒడిదుడుకులు చూసిందన్నారు. శనివారం గాంధీభవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రేవంత్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం కేసీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డారని అన్నారు. టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అభ్యర్థులను బెదిరించారని, తమ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని అన్నారు రేవంత్ . మంత్రులే అభ్యర్ధులను ప్రలోభాలకు గురి చేశారన్నారు. ఈ గెలుపు టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కాదని, ఆ పార్టీ ప్రలోభాలు, బెదిరింపు రాజకీయాల వల్లే గెలించిందన్నార రేవంత్.

Congress party leader Revanth reddy press meet in Gandhi Bhavan

Latest Updates