ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఇవాళ సమావేశం కానుంది. సోనియా నేతృత్వంలో కొత్తగా ఎన్నికైన 52 మంది కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో సమావేశం కానున్నారు. ఈ భేటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా హాజరవనున్నారు. లోక్ సభ ఫలితాల తర్వాత పార్టీ అధికారిక కార్యక్రమాల్లో రాహుల్ రెండోసారి పాల్గొననున్నారు. ఓటమి తర్వాత CWC సమావేశమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీకి హాజరవనున్నారు. అటు లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతలను ఇవాళే ఎన్నుకోనున్నారు. గత టర్మ్ లో మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు పదవి ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Latest Updates