ప్రియాంక కష్టాన్ని వృథా చేశాం: రాజ్​బబ్బర్

‘పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రియాంక గాంధీ చాలా కష్టపడ్డారు. ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఆమెపై ప్రజలు చూపించిన అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో మేం విఫలమయ్యాం. ఇది అభ్యర్థులు, స్థానిక నేతలు, కార్యకర్తల వైఫల్యమే తప్ప ప్రియాంకది కాదు’ అని యూపీ కాంగ్రెస్​చీఫ్​రాజ్​బబ్బర్ సోమవారం మీడియాతో​చెప్పారు. రాష్ట్రంలో 80 చోట్ల పోటీచేస్తే ఒకే ఒక్క సీటు గెల్చుకోవడం అసంతృప్తి కలిగించిందన్నారు. అమేథీలో రాహుల్​గాంధీ ఓటమి బాధాకరమని చెప్పారు. నియోజకవర్గానికి రాహుల్​చాలా చేశారన్నారు. అమేథీ ప్రజలను తన కుటుంబంగా రాహుల్​భావించారని, ప్రజలు మాత్రం ఆయనను ఓడించారన్నారు. వయనాడ్​లో ఎంపీగా గెలిచి ఉండొచ్చు కానీ అమేథీలో ఓడిన బాధ రాహుల్​ను వెంటాడుతూనే ఉంటుందన్నారు. ఫతేపూర్​సిక్రి నుంచి లోక్​సభకు పోటీ చేసిన రాజ్​బబ్బర్ కూడా ఓడిపోయారు. ఎన్నికల్లో ​ఓటమికి ఇతరులను నిందించబోమని బబ్బర్​చెప్పారు.

Latest Updates