
న్యూఢిల్లీ: వచ్చే నెలలో నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. కరోనా నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే మహమ్మారి విజృంభిస్తున్న ఈ టైమ్‌లో స్టూడెంట్స్ ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఎగ్జామ్స్ జరపడం ఏంటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ విషయంపై తాజాగా కాంగ్రెస్ సుప్రీం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించిందని సమాచారం. నీట్, జేఈఈ వివాదంపై సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయాలని కాంగ్రెస్ డెసిజన్ తీసుకుందని తెలుస్తోంది. నీట్–జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్‌పై శుక్రవారం సుప్రీం కోర్టులో కాంగ్రెస్ రిట్ పిటిషన్ వేయనుందని అడ్వకేట్ జనరల్ అతుల్ నందా స్పష్టం చేశారు. కాంగ్రెస్ నిర్ణయానికి బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, రాజస్థాన్ ప్రభుత్వాలు తమ మద్దతు తెలిపాయని తెలిసింది.