ఆపదలో ఉన్న వారికి రూ.7,500 ఇవ్వాలి: సోనియా

న్యూఢిల్లీ: కరోనా లాక్ డౌన్ వల్ల ప్రభావితమైన పేదలకు సాయం చేసేందుకు ప్రభుత్వ ఖజానా తాళాలను కేంద్రం తెరవాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. స్పీక్ అప్ ఇండియా అనే క్యాంపెయిన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఓ వీడియోలో సోనియా పై వ్యాఖ్యలు చేశారు. కరోనా కారణంగా చాలా మంది ప్రజలు జీవనోపాధి కోల్పోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పటికీ వారి బాధలు, గాయాలు, కేకలు కేంద్రానికి పట్టట్లేదని సోనియా మండిపడ్డారు.

‘కేంద్రం తన ఖజానా బాక్సుల తాళాలను తెరివాలి. ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలని కోరుతున్నాం. ఆయా కుటుంబాల ఖాతాల్లో వచ్చే ఆరు నెలల పాటు ప్రతి నెలా రూ.7,500 డబ్బును డైరెక్ట్ గా వేయాలి. ఇప్పుడు అత్యవసరంగా రూ.10 వేలు ఇవ్వాలి. అలాగే లేబర్స్ ను వారి ఇళ్లకు సేఫ్ గా, ఉచితంగా పంపాలి. ఉద్యోగ కల్పనతోపాటు రేషన్ సరుకులను కూడా అందివ్వాలి. విలేజెస్ లో పని కల్పించడానికి నరేగా పని దినాలను 200 రోజులకు పెంచాలి. లోన్స్ ఇచ్చే బదులు స్మాల్, మీడియం ఇండస్ట్రీస్ కు ఫైనాన్షియల్ రిలీఫ్​ఇవ్వాలి. దీంతో కోట్లాది ఉద్యోగాలను కాపాడొచ్చు’ అని ఆ వీడియో మెసేజ్ లో సోనియా పేర్కొన్నారు.

Latest Updates