ముంబై ఫ్లైటెక్కిన రెబల్ ఎమ్మెల్యే

  • మరొకరిని తీసుకొస్తాడా.. అటేనా?
  • తిరిగొస్తాడంటున్న కర్నాటక కాంగ్రెస్

బెంగళూరు: కర్నాటకంలో మరో కొత్త అంకం తెరపైకి వచ్చింది. రెబెల్​ఎమ్మెల్యేలలో ఒకరైన ఎంటీబీ నాగరాజ్​ఆదివారం మళ్లీ ముంబై ఫ్లైటెక్కారు. శనివారం కాంగ్రెస్​ సీనియర్​ నేతలతో చర్చల తర్వాత నాగరాజ్ తన రాజీనామాను ఉపసంహరించుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, నాగరాజ్​మళ్లీ ముంబై వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్​నేతలు మాత్రం నాగరాజ్​పై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరో రెబెల్​ఎమ్మెల్యే కె.సుధాకర్​కు నచ్చజెప్పి, వెనక్కు తీసుకురావడానికే నాగరాజ్​ముంబై వెళ్లాడని చెబుతున్నారు.

సుధాకర్​తో చర్చించాకే..

సుధాకర్​తో కలిసి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని, ఇప్పుడు ఒక్కడినే రాజీనామాను వెనక్కు తీసుకోలేనని నాగరాజ్​మీడియాకు వెల్లడించారు. సుధాకర్ ను వెనక్కు తీసుకురావడానికే ముంబై వెళుతున్నట్లు ఆయన చెప్పారు. రెండు రోజులుగా సుధాకర్​సెల్​ఫోన్​స్విచ్చాఫ్​ వస్తోందని అందుకే తాను బయలుదేరానని వివరించారు. రాజీనామా వాపస్​ తీసుకోవడానికి సుధాకర్​ ఒప్పుకోకుంటే ఏంచేస్తారని విలేకరులు ప్రశ్నించగా.. ఆ విషయంపై ఇప్పుడేమీ చెప్పలేనని అన్నారు. ఏదేమైనా రాజీనామాపై సుధాకర్​తో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటానని నాగరాజ్​స్పష్టం చేశారు.

మరో ఎమ్మెల్యేను తీసుకొస్తాడు..

చిక్​బళ్లాపుర ఎమ్మెల్యే సుధాకర్​ ముంబైలో ఉన్నారని, ఆయనను కలిసి కాంగ్రెస్​లో కొనసాగేలా ఒప్పించేందుకే నాగరాజు ముంబై వెళ్లాడని కాంగ్రెస్​ఎమ్మెల్యే, మాజీ మంత్రి హెచ్ ​కె పాటిల్​చెప్పారు. శనివారం జరిగిన చర్చలతో నాగరాజ్ రాజీనామాను ఉపసంహరించుకునేందుకు ఒప్పుకున్నాడని చెప్పారు. కాంగ్రెస్​లోనే ఉంటానని ప్రామిస్​ చేయడంతో పాటు సుధాకర్​ను వెనక్కు తీసుకొస్తానని చెప్పాడన్నారు. మరో అసమ్మతి ఎమ్మెల్యే రామలింగారెడ్డిని సముదాయించే పనిని పాటిల్​తో పాటు పార్టీ రాష్ట్ర వర్కింగ్​ప్రెసిడెంట్ ఈశ్వర్​ఖాండ్రెలకు కాంగ్రెస్​బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా పాటిల్ ఆదివారం రామలింగా రెడ్డి నివాసం చేరుకుని ఆయనతో చర్చలు జరిపారు. అయితే, దీనిపై మాట్లాడేందుకు పాటిల్​నిరాకరించారు.

ఆరోపణలు ఖండించిన నడ్డా

రాంచీ: కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యేలను కొంటోందన్న కాంగ్రెస్​ఆరోపణలను ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​జేపీ నడ్డా ఖండించారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. కర్నాటక రాజకీయ సంక్షోభం కాంగ్రెస్​పార్టీ అంతర్గత విషయమన్నారు. రాహుల్ ​రాజీనామాతో పార్టీ నేతలు కూడా రిజైన్ ​చేస్తున్నారని నడ్డా చెప్పారు. మోడీ నాయకత్వంలో బీజేపీ లో కొత్త సంస్కృతి ఏర్పడిందన్నారు. ఓటు బ్యాంకు, వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించే వారినే పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

 

Latest Updates