కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లు ర‌వి ఓటు గ‌ల్లంతు

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు రవి ఓటు గల్లంతు అయ్యింది. GHMC ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్ లోని ఓ పోలింగ్ సెంటర్ కు వెళ్లగా…అక్కడి ఓటరు లిస్టులో ఆయన పేరు కన్పించలేదు. దీంతో మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఓటు గల్లంతు అయిందని అధికారులకు ఫిర్యాదు చేశారు.

గ్రేటర్ ఎన్నికల్లో.. అనేకమంది ఓటర్లకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ఆన్ లైన్ ఓటరు లిస్టులో పేరున్నా, పోలింగ్ సెంటర్ దగ్గర  ఓటరు లిస్టులో పేరు లేకపోవడంతో ఓటర్లు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఓట్లు గల్లంతు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates