‘నిన్ను సీఎం ని చేశారు, రాజు ను కాదు’

కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్ నదుల అనుసంధానం అంటున్నారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి. బుధవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ… నీటి వినియోగంపై కేసీఆర్ కు సరైన అవగాహన లేదన్నారు. రాష్ట్రంలో 70 శాతం కృష్ణానది ఉంటే 30 శాతం నీటినే కేటాయించారన్నారు. పోతిరెడ్డిపాడుపై సర్కార్ తీరు వల్ల భవిష్యత్ లో నాగార్జున సాగర్ ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అసెంబ్లీలో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు నాగం.

తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేశారు తప్ప రాష్ట్రానికి  రాజును చేయలేదన్నారు నాగం. ఆనేక మంది ప్రాణ త్యాగాల ఫలితమే తెలంగాణ అని ఆయన అన్నారు. అలా సాధించి తెచ్చుకున్న తెలంగాణలో  ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసి… సీఎం రాచరిక పాలన, కుటుంబ పాలన చేస్తున్నారని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు.

Latest Updates