కాంగ్రెస్ బలమైన యోధుడ్ని బార్డర్‌‌కు పంపింది: పైలట్

జైపూర్: రాజస్థాన్‌లో నెల రోజుల నుంచి కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్ఠంభనకు శుక్రవారం ఎండ్ కార్డు పడింది. సచిన్ పైలట్‌తోపాటు రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి రావడంతో విశ్వాస పరీక్షలో సీఎం అశోక్ గెహ్లాట్ నాయకత్వంలోని ప్రభుత్వం సులభంగా నెగ్గింది. విశ్వాస పరీక్ష జరుగుతున్న ప్రారంభమైన సమయంలో పైలట్ విపక్షానికి చేరువలో కూర్చున్నారు. ఆయన తన సీటును మార్చిన వెంటనే చర్చలో చురుగ్గా వ్యవహరించారు.

అశోక్ గెహ్లాట్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని రక్షించడానికి కాంగ్రెస్ తన బలమైన యోధుడ్ని బార్డర్‌‌కు పంపిందన్నారు. మామూలుగా అసెంబ్లీ సమావేశాల్లో గెహ్లాట్ దగ్గరలో కూర్చునే పైలట్ శుక్రవారం మాత్రం విపక్షానికి చేరువలో కూర్చున్నారు. ‘నన్ను అక్కడ ఎందుకు కూర్చోమన్నారోనని ఆలోచించా. కానీ ఆ తర్వాతే నేను గ్రహించా. ఎందుకంటే అది సరిహద్దు ప్రాంతం కాబట్టి అక్కడ సమర్థమైన, బలవంతుడైన సైనికుడి అవసరం ఉంటుందని అర్థం చేసుకున్నా. కరోనా కారణంగా సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను పాటిస్తూ రాజస్థాన్ అసెంబ్లీలో స్పెషల్ సీటింగ్ అరేంజ్‌మెంట్స్ చేశారు.

Latest Updates