శివసేనలో చేరిన ప్రియాంక చతుర్వేది

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ  అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శివసేన పార్టీలో చేరారు. కాంగ్రెస్  అధికార ప్రతినిధికి గురువారం రాజీనామా చేసిన ఆమె శుక్రవారం శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే సమక్షంలో ఆ పార్టీలో చేరారు. చాలా ఆలోచించి  శివసేనలో చేరాలని  నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆమె  పార్టీ పరంగా తాను నిర్వరిస్తున్న బాధ్యతలన్నింటికీ స్వస్తి పలుకుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశానని చెప్పారు.  ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆమె తన రాజీనామా లేఖను పంపారు. తాను చేస్తున్న సేవలకు కాంగ్రెస్ పార్టీలో విలువ లేదని వాపోయారు ప్రియాంక .

Latest Updates