రాష్ట్రపతి దృష్టికి పార్టీ ఫిరాయింపులు

హైదరాబాద్ : రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో పిర్యాదు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ తో పాటు TDP, CPI, TJS, ఇంటి పార్టీలు… ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కలవాలని నిర్ణయించాయి. మొత్తం 15 మంది సభ్యుల బృందం రామ్ నాథ్ కోవింద్ ను కలవాలని నిర్ణయించామని.. తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని రాష్ట్రపతి భవన్ అధికారులకు లెటర్ రాశారు.

రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలుచేయాలని.. ఫిరాయింపులు జరగకుండా చూడాలని… పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని రాష్ట్రపతిని కోరనున్నారు నాయకులు. ఇప్పటికే గవర్నర్ నరసింహన్ ను, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు.. ఇపుడు జాతీయస్థాయిలో దీనిపై కంప్లైంట్ చేయాలని డిసైడయ్యారు. త్వరలోనే నాయకుల బృందం ఢిల్లీకి వెళ్లనుంది.

Latest Updates