దుబ్బాక బరిలో పోటీపడుతున్న ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్ధులు

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ముగ్గురు అభ్యర్ధులు పోటీపడుతున్నారనే ప్రచారం జరుగుతుంది.

సెప్టెంబర్ 11 న గాంధీభవన్ లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజా నర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్ ఏఐసీసీ కార్యదర్శులు వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, బలరాం నాయక్, దుబ్బాక నాయకులు పార్టీ అనుబంధ సంఘాల నాయకుల తో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.

ఈ భేటీలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, పీసీసీ కార్యదర్శి నగేష్ ముదిరాజుకు ఎన్నికల వ్యవహారాల బాధ్యతల్ని అప్పగించారు. ప్రతీ మండలానికి నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, మండలం లోని గ్రామాలకు ముఖ్య నాయకులు ఇంఛార్జీలను, మండలాల వారీగా అనుబంధ కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దుబ్బాకలో ముగ్గురు కాంగ్రెస్ నేతలు..?

దుబ్బాక ఉప ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్ నేతలు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. వారిలో

2014లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై పోటీచేసిన శ్రవణ్ కుమార్ రెడ్డి..ఈయన దుబ్బాక నియోజక వర్గానికి చెందిన వారే కానీ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు.

2) కోమటి రెడ్డి వెంకట నరసింహా రెడ్డి .దుబ్బాక నియోజకవర్గం లో ఉంటున్నారు.

3)డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డిలు. ఈ ముగ్గురు టిక్కెట్ ఆశిస్తుండగా..2018 సాధారణ ఎన్నికల్లో పోటీచేసిన మద్దుల నాగేశ్వర్ రెడ్డి మాత్రం అందుబాటులో లేరు. 2018లో మద్దుల నాగేశ్వర్ రెడ్డి కి 26, 799 ఓట్లు రాగా..ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 16శాతం ఓట్లు పోలయ్యాయి

Latest Updates