
- నాలుగు స్థానాల్లో గెలుపు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో 4 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. రెండు నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. లాహౌల్– స్పితి, సుజన్ పూర్, గాగ్రెట్, కుట్లేహార్లలో కాంగ్రెస్, ధర్మశాల, బార్సార్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. లాహౌల్– స్పితి నుంచి బరిలో నిలిచిన అనురాధ రాణా ఇండి పెండెట్గా పోటీ చేసిన బీజేపీ మాజీ మంత్రి రామ్ లాల్ మర్కాండపై 1,960 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
అనురాధకు 9,414 ఓట్లు రాగా.. మర్కాండకు 7,454 ఓట్లు వచ్చాయి. సుజన్ పూర్ నుంచి పోటీ చేసిన కెప్టెన్ రంజిత్ సింగ్కు 29,529 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రాజిందర్ రాణా 27,089 ఓట్లు సాధించారు. గాగ్రెట్లో రాకేశ్ కాలియాకు 35,768 ఓట్లు రాగా, సమీప బీజేపీ అభ్యర్థి చైతన్య ప్రసాద్ 27,281 ఓట్లు వచ్చాయి. కుట్లేహార్లో వివేక్కు 36,853 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి దవీందర్ భుట్టో 31,497 ఓట్లు సాధించారు.
రెండు స్థానాల్లో బీజేపీ ఘన విజయం
ధర్మశాల, బార్సార్ స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ధర్మశాల నుంచి బరిలో నిలిచిన మాజీ మంత్రి సుధీర్ శర్మ కాంగ్రెస్ అభ్యర్థి దేవిందర్ సింగ్ పై 5,526 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సుధీర్ కు 28,066 ఓట్లు రాగా దేవిందర్ కు22,540 ఓట్లు వచ్చాయి.బార్సార్ లో ఇందర్ దత్ లఖన్ పాల్ 2,125 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇందర్ కు 33,086 ఓట్లు రాగా సుభాశ్ చంద్ 30,961 ఓట్లు సాధించారు.