గల్లీలో కుక్క లొల్లి : మహిళలను కొట్టినందుకు కాంగ్రెస్ నేత అరెస్ట్

పెద్దపల్లి: జిల్లాలో ఓ కాంగ్రెస్‌ కార్యకర్త రెచ్చిపోయాడు. మహిళలపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. గాంధీనగర్‌ లో కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి కట్కూరి సందీప్‌ నివాసం ఉంటున్నాడు. అతనికి ఓ పెంపుడు కుక్క ఉంది. తమ ఇంటి ముందు పరిసరాలను కుక్క అపరిశుభ్రం చేస్తోందని పక్కింటి వారు సందీప్ ఫ్యామిలీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని.. దీంతో వారు సందీప్‌ ను నిలదీశారు.

నన్నే నిలదీస్తారా అంటూ సందీప్ పక్కింటి మహిళలను విచక్షణారహితంగా కొట్టాడు. ఇరుగు పొరుగు వారు సర్దిచెబుతున్నప్పటికీ సందీప్‌ ఆగలేదు. ఎవరు అడ్డువచ్చినా మహిళలపై తన ప్రతాపాన్ని చూపించాడు. సందీప్ మహిళలపై చేస్తున్న దాడిని అక్కడ ఉన్నవారు తమ సెల్ ఫోన్‌ లలో వీడియో తీశారు. ఎవరు అడ్డుకున్నా ఆగకుండా, వారు కిందపడిపోయినా వదలకుండా సందీప్ వారిపై పిడిగుద్దులు గుద్దాడు. స్థానికంగా ఈ గొడవ వివాదాస్పదంగా మారింది. గాయపడిన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సందీప్‌ ను అరెస్టు చేశారు పోలీసులు.

Latest Updates