టీఆర్ఎస్ తో స్నేహ పూర్వకంగా ఉంటూనే రాజకీయం నడుపుతున్నారు

బీజేపీ నాయ‌కులు.. టీఆర్ఎస్ ప్రభుత్వంతో స్నేహ పూర్వకంగా ఉంటూనే రాజకీయం నడుపుతున్నార‌ని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమ‌వారం నాడు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా.. తెలంగాణ‌లోని బీజేపీ జిల్లా కార్యాల‌యాల‌కు వ‌ర్చువ‌ల్ వేదిక‌గా భూమి పూజలో పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో న‌డ్డా చేసిన వ్యాఖ్య‌ల‌పై పొన్నం స్పందిస్తూ.. “తెలంగాణ ప్రభుత్వం పై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై అవినీతి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు గతంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా జేపీ నడ్డా అవినీతి ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కేసీఆర్ ప్రభుత్వం పై విచారణ చేయొచ్చు కదా..!” అని అన్నారు.

బీజేపీ మాటలకు మాత్రమే పరిమితమవుతుందని అన్నారు. నిజంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణ ప్రభుత్వం పై ఆరోపణలు చేసినట్టయితే… నిజాయితీగా విచారణ చేయించాలని అన్నారు. లేదంటే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య స్నేహం ఉందని ఒప్పుకోవాల‌న్నారు. తెలంగాణ ప్రజలను అవివేకులు గా చూస్తున్నారని ..అది తప్పని అన్నారు పొన్నం.

Congress Working President Ponnam Prabhakar said that BJP leaders are running politics while remaining friendly with the TRS government

Latest Updates