హ్యాట్సాఫ్ పోలీస్ : అల‌సిపోయిన‌ కానిస్టేబుల్..

లాక్ డౌన్ క్ర‌మంలో ప్ర‌జ‌లు బ‌య‌టికి రాకుండా పోలీసులు ప‌గ‌లు రాత్రి అనే తేడా లేకుండా కాప‌లాకాస్తూ డ్యూటీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ ఫ్యామిలీల‌ను వ‌దిలి రోడ్ల‌పైనే డ్యూటీ చేస్తున్నారు. అయితే డ్యూటీలో అల‌సిపోయాడో ఏమో పాపం.. సైబ‌రాబాద్ లో డ్యూటీ నిర్వ‌హిస్తున్న ఓ కానిస్టేబుల్.. విధులు ముగిసిన త‌ర్వాత రోడ్డు మీదే ట‌వ‌ల్ వేసుకుని కాసేపు ప‌డుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూ వైర‌ల్ గా మారింది.

రియ‌ల్ హీరోలంటూ ప్ర‌శంస‌లు అందిస్తున్నారు నెటిజ‌న్లు. లాక్ డౌన్ లో పోలీసుల ప‌నితీరు సూప‌ర్బ్ అంటున్నారు. నిత్యం ఉరుకుల ప‌రుగుల జీవితంలో అల‌సిన కానిస్టేబుల్ రోడ్డు ప‌క్క‌నే ప‌డుకోవ‌డంతో .. ప్ర‌తి ఒక్క‌రినీ ఈ ఫొటో ఆలోచింప‌జేస్తుంది అంటూ ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు. హ్యాట్సాప్ పోలీస్ అంటూ కితాబిస్తున్నారు.

Latest Updates