కానిస్టేబుల్ క‌మిట్ మెంట్ : 450 కి.మీ న‌డిచాడు

లాక్ డౌన్ క్ర‌మంలో పోలీసుల తిప్ప‌లు అన్నీ ఇన్నీ కావు. ఎండ‌ను సైతం లెక్క చేయ‌కుండా రోజూ రోడ్ల‌పై డ్యూటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వీట‌న్నింటికంటే మ‌రో అడుగు ముందుకేశాడు ఓ కానిస్టేబుల్. 10 కాదు 20 కాదు ఏకంగా 450 కిలోమీట‌ర్లు న‌డిచి అంద‌రి చేత ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కు చెందిన కానిస్టేబుల్ దిగ్విజ‌య్ శ‌ర్మ‌కు మ‌ధ్య ప్ర‌దేశ్,  రాజ్ గ‌ర్ లోని 450 కి.మీ దూరంలో డ్యూటీ ప‌డింది. అయితే అందుబాటులో వాహ‌నాలు లేక‌పోవ‌డంతో అధికారులు ఇంట్లోనే ఉండ‌మ‌ని చెప్పారు. కానీ లాక్ డౌన్ దృష్ట్యా డ్యూటీ చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో మార్చి -25న బ‌య‌లు దేరిన శ‌ర్మ న‌డుచుకుంటూ, మ‌ద్య‌లో లిప్ట్ తీసుకుంటూ మార్చి -28న డ్యూటీ ప్లేస్ రాజ్ గ‌ర్ కు  చేరుకున్నాడు. దీంతో కానిస్టేబుల్ దిగ్విజ‌య్ శ‌ర్మ క‌మిట్ మెంట్ ను ఉన్న‌తాధికారులు మెచ్చుకున్నారు.

Latest Updates